రంజాన్ తోఫా పంపిణీ చేసిన ఎమ్మెల్యే
ATP: అనంతపురంలోని పలు ప్రాంతాలలో ఆదివారం పేద ముస్లిం కుటుంబాలకు ఎమ్యెల్యే దగ్గుపాటి ప్రసాద్ రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్యెల్యే మాట్లాడుతూ.. హజ్ యాత్రకు వెళ్లే వారికి తన వంతు సహకారాన్ని అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో మైనారిటీలకు అనేక పథకాలను రద్దు చేశారన్నారు. సుమారు 2,000 మందికి రంజాన్ తోఫా పంపిణీ చేశారు.