ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన మంత్రి
అన్నమ్మయ్య: బోరెడ్డిగారిపల్లిలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజల సమస్యలు స్వయంగా విని, తక్షణ పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉండటం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ వినతులను సమర్పించారు. అనంతరం అధికారులు, ప్రజలు పుష్పగుచ్ఛాలతో మంత్రిని సత్కరించారు.