ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎంపీ
కోనసీమ: లోక్‌సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి వర్ధంతి సందర్భంగా అమలాపురంలో మంగళవారం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిభిరాన్ని ఎంపీ హరీష్ బాలయోగి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. ఈ శిబిరంలో సుమారు 600 వందల మందికి వివిధ ఆరోగ్య సమస్యలపై పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశారు.