మడికొండలో ఖాళీ ప్లాట్ల యజమానులకు నోటీసులు జారీ

HNK: జిల్లా కాజీపేట మండలం మడికొండ గ్రామంలోని మెట్టు రామలింగేశ్వర స్వామి కాలనీలో సోమవారం మున్సిపల్ అధికారులు ఖాళీ ప్లాట్ల యాజమానులకు నోటీసులను అందజేశారు. వెంటనే ఖాళీ ప్లాట్లను చదును చేసి వర్షం నీరు నిలవకుండా చూడాలని లేనిపక్షంలో జరిమానా విధించడం జరుగుతుందని నోటీసులో పేర్కొన్నారు. సానిటరీ ఇన్స్‌పెక్టర్ రవీందర్ 52 మందికి నోటిస్‌లు ఇచ్చారు.