కాంగ్రెస్, BRS రెండూ ఒక్కటే: కిషన్ రెడ్డి
TG: హైకోర్టు తీర్పుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ కుటుంబ అవినీతిపై ఆధారాలు సమర్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అవినీతిపై సరైన విచారణ జరగడం లేదని, కాంగ్రెస్, BRS రెండూ ఒక్కటేనని ఆరోపించారు. ఒకరిని ఒకరు కాపాడుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారని, కేసీఆర్ అవినీతిపై కాంగ్రెస్ చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని ఆయన మండిపడ్డారు.