ఏకగ్రీవ సర్పంచ్‌లను సన్మానించిన MLA

ఏకగ్రీవ సర్పంచ్‌లను సన్మానించిన MLA

ADB: నేరడికొండ మండలంలోని లకంపూర్ (జీ) గ్రామానికి చెందిన సేడ్మాకీ గంగాధర్, 8 మంది వార్డు మెంబర్లు గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికైన అభ్యర్థులు ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అభ్యర్థులను ఎమ్మెల్యే శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు. ప్రజాసేవలో నిర్విరామంగా ముందుకు వెళ్లాలని సూచించారు.