రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

కాకినాడ నుంచి కరప మీదుగా వెళ్తుండగా సోమవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. రెండు ట్రాక్టర్లు, మోటార్ సైకిల్ ఢీకొన్న ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న యువకుడు ట్రాక్టర్ కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న కరప ఎస్సై సునీత కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.