పేలుడు ఘటనలో మృతి చెందింది వీళ్లే..!
సత్యసాయి: కుమ్మరవాండ్లపల్లిలో జరిగిన భారీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మాబున్ని, మధు, సంపత్, వెంకన్న అనే నలుగురు మృతి చెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడటంతో వారిని కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. జిలిటెన్ స్టిక్స్ పేలడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం.