పొన్నూరులో పర్యటించిన కమిషనర్

పొన్నూరులో పర్యటించిన కమిషనర్

GNTR: పొన్నూరులోని మున్సిపల్ కమిషనర్ ముప్పాళ్ల రమేష్ బాబు ఆదివారం పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన 23వ వార్డు, అంబేద్కర్ కాలనీలోని పార్కును సందర్శించి, పార్కుల పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని శానిటేషన్, సచివాలయ సిబ్బందికి సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.