VIDEO: పీఏసీఎస్ వద్ద బారులు తీరిన రైతులు

KMM: తల్లాడ PACS వద్ద సోమవారం యూరియా కోసం రైతులు పోటెత్తారు. ఒకటి రెండు బస్తాల యూరియా కోసం గంటల తరబడి ఎదురు చూశారు. తమకు సరిపడా యూరియాను అందించడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. నెల రోజుల వ్యవధిలో మూడు సార్లు సొసైటీని రైతులు ముట్టటించినా అధికారులు పట్టించుకోవడం లేదు. మార్పు కోరుకున్నాం కదా...!? మార్పు బాగుందా అంటూ ఒకరినొకరు ఓదార్చుకున్నారు.