పోస్టల్ బ్యాలెట్ వేసిన ఉద్యోగులు
KMR: నాగిరెడ్డిపేటలో ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్‌ను సద్వినియోగం చేసుకున్నారు. రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు పెద్ద ఎత్తున ఎంపీడీవో కార్యాలయానికి తరలివచ్చారు. అక్కడ తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా సద్వినియోగం చేసుకున్నట్లు ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ తెలిపారు.