వేతనాలు చెల్లించాలని నిరసన

వేతనాలు చెల్లించాలని నిరసన

ప్రకాశం: మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల మార్చి నెల వేతనాలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మార్కాపురం మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ప్రతినెల వేతనాలు చెల్లింపులు ఆలస్యం జరుగుతుండడం వల్ల తమ కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, పని చేసినందుకు సరైన సమయంలో వేతనాలు చెల్లించడం ప్రభుత్వ బాధ్యత అని వారు తెలిపారు.