పులివెందుల మున్సిపల్ కమిషనర్ కీలక ప్రకటన

పులివెందుల మున్సిపల్ కమిషనర్ కీలక ప్రకటన

KDP: పులివెందుల మున్సిపల్ కమిషనర్ రాముడు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పురపాలక సంఘానికి చెందిన షాపింగ్ కాంప్లెక్స్‌లలో ఖాళీగా ఉన్న గదులను అద్దెకు ఇవ్వనున్నట్లు తెలిపారు. స్వాధీనమైన తేదీ నుండి మూడు సంవత్సరాల కాలానికి నెలవారీ అద్దె చెల్లించే విధానంలో గదులు కేటాయించనున్నట్లు చెప్పారు. ఈ నెల 7న ఉదయం 10.30 గంటలకు జరిగే బహిరంగ వేలంలో పాల్గొనాలని ఆసక్తి ఉన్నవారిని కోరారు.