ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పుట్టపర్తిలో 'రచ్చబండ'

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పుట్టపర్తిలో 'రచ్చబండ'

సత్యసాయి: రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ చేపట్టడంతో సామాన్య ప్రజలకు కలిగే ఇబ్బందులను వివరిస్తూ పుట్టపర్తి వైసీపీ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో 'రచ్చబండ' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కొత్త వార్డు కమిటీలను ఏర్పాటు చేశారు.