'నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి'
జగిత్యాల కలెక్టరేట్‌లో ఈనెల 14న ప్రారంభం కానున్న SSC పరీక్షల నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులకు అవగాహన సమావేశం నిర్వహించారు. జిల్లా అడిషనల్ కలెక్టర్లు లత, రాజా గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పరీక్షల నిర్వహణకు సంబంధించిన నిబంధనలను వివరించి తప్పనిసరిగా పాటించాలన్నారు. 20 మండలాల విద్యాధికారులు, 68 సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.