లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ
MBNR: బాలానగర్ మండలంలోని జాలుగడ్డ తండాలో ప్రభుత్వం మంజూరు చేసిన నూతన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను సర్పంచ్ రాము నాయక్ బుధవారం పంపిణీ చేశారు. సర్పంచ్ మాట్లాడుతూ.. మంజూరైన నిధులతో లబ్ధిదారులు నాణ్యమైన ఇళ్లను నిర్మించుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేర్చాలనేది కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.