గత ఏడాది ఇదే రోజున రాష్ట్రంలో సంచలనం

గత ఏడాది ఇదే రోజున రాష్ట్రంలో సంచలనం

కృష్ణా: రాష్ట్రంలో గతేడాది ఇదే రోజున సంచలనం రేపిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుకు ఫిబ్రవరి 14తో ఏడాది పూర్తయింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఆయనను అప్పట్లో పోలీసులు అరెస్ట్ చేయగా, అనంతరం ఆయనపై పలు కేసులు నమోదు చేశారు. దాదాపు 130 రోజులకుపైగా జైలు జీవితం గడిపిన వంశీ, చివరికి కోర్టు బెయిల్ మంజూరుతో విడుదలయ్యారు.