సోమిని సర్పంచ్‌గా బీజేపీ బలపరచిన అభ్యర్థి సరిత
ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలోని సోమిని గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. బీజేపీ బలపరచిన అభ్యర్థి పెగడపల్లి సరిత విజయం సాధించారు. ఫలితాలు వెలువడగానే ఆమె అనుచరులు ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు. దీంతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది.