దొంగల గుట్టురట్టు చేసిన పోలీసులు

దొంగల గుట్టురట్టు చేసిన పోలీసులు

VZM: సాలూరు పట్టణంలో ఇటీవల జరిగిన దొంగతనాన్ని పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ. 35 వేల నగదు, 6.5 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ అప్పలనాయుడు తెలిపారు. వాహన తనిఖీల్లో అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించగా వారు దొంగతనాన్ని ఒప్పుకున్నారు. అనంతరం నిందితులను రిమాండ్‌కు తరలించారు.