VIDEO: పత్తి రైతులకు లాభకరంగా మారిన వర్షాలు

VIDEO: పత్తి రైతులకు లాభకరంగా మారిన వర్షాలు

కృష్ణా: గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు గాను పత్తి సాగు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిరుజల్లులకు పత్తిపంట లాభదాయకంగా మారిందని రెడ్డిగూడెం మండల రైతులు అంటున్నారు. పూతదశలోనే ఉన్న ఈ పంటకు వర్షాల వల్ల నష్టం లేదని, ఎరువులు, క్రిమిసంహారక మందులు పిచికారీ చేశాక మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతున్నాయని రైతులు పేర్కొన్నారు. దీంతో రైతులు వరుణ దేవునికి కృతజ్ఞతలు తెలిపారు.