జలమయం అయిన రాజమండ్రి వీధులు

జలమయం అయిన రాజమండ్రి వీధులు

E G: అల్పపీడన ప్రభావంతో గత రాత్రి నుంచి భారీ వర్షం కురవడంతో రాజమండ్రిలోని వీధులన్నీ జలమయమయ్యాయి. ప్రధానంగా పుష్కర్ ఘాట్ రోడ్డు, హైటెక్ బస్టాండ్, కోటిపల్లి బస్టాండు, రైల్వే స్టేషన్ రోడ్డులో భారీగా నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మోకాళ్ళ లోతు నీరు చేరడంతో పాదచారులు కనీసం నడవలేని పరిస్థితి నెలకొంది.