'మిల్లింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి'
ASF: మిల్లింగ్ ప్రక్రియ వేగవంతం చేసి నాణ్యత ప్రమాణాలు పాటించాలని జిల్లా కలెక్టర్ హరిత అన్నారు. కలెక్టరేట్‌లో రైస్ మిల్లర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ధాన్యాన్ని సమయానికి మిల్లింగ్ చేసి, నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయాలని, మిల్లింగ్ ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం, నిర్లక్ష్యం అనుమతించరాదని ఆమె ఆదేశించారు. ప్రభుత్వానికి నష్టం రాకుండా చూడాలన్నారు.