కౌలు రైతుల రుణాలు మాఫీ చేయాలి

కౌలు రైతుల రుణాలు మాఫీ చేయాలి

కౌలు రైతుల రుణాలను మాఫీ చేయాలని రైతు సంఘం కార్యదర్శి గుడికి అప్పలనాయుడు అన్నారు. గురువారం పాలకొండ ఆర్డిఓ రమణని కలిసి వినతి పత్రం అందించారు. ఆరుగాలం శ్రమిస్తున్న కౌలు రైతన్నలకు కనీసం లక్ష రూపాయలన్నా రుణమాఫీ చేయాలని కోరారు. ప్రభుత్వం కౌలు రైతులను ఆదుకోవాలని వేడుకున్నారు.