సినీ ఇండస్ట్రీకి ప్రత్యేక గుర్తింపు ఇస్తాం: సీఎం
TG: సినీ పరిశ్రమకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. చెన్నై నుంచి పరిశ్రమను హైదరాబాద్‌కు తరలించడంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి మహానుభావుల కృషి మరువలేనిదని కొనియాడారు. పరిశ్రమ పెద్దగా దాసరి నారాయణరావు, సినీ కార్మికుల పక్షపాతిగా ప్రభాకర్ రెడ్డి చేసిన సేవలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు.