రబీకి సిద్ధమవుతున్న రైతులు

రబీకి సిద్ధమవుతున్న రైతులు

KNR: శంకరపట్నం మండల వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్ ముగిసి ధాన్యం అమ్మకాలు దాదాపు పూర్తి కావస్తుండడంతో రైతన్నలు రబీ సీజన్‌కు సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే మండల వ్యాప్తంగా నారుమళ్లు సిద్ధం చేసి మొలక అలుకుతున్నారు. ఈ సీజన్లో ఎక్కువ శాతం దొడ్డు రకాలనే సాగు చేస్తున్నట్లు మండల రైతులు తెలిపారు. నారు సంరక్షణకు చలికాలంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.