సంబరాల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్
MHBD: కురవి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ సంబరాలు చేసుకున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలలో కాంగ్రెస్ గెలిచిన నేపథ్యంలో ఈ సంబరాలు నిర్వహించగా ప్రభుత్వవిప్, డోర్నకల్ MLA డా. రాంచందర్ నాయక్ పాల్గొని స్థానిక నాయకులకు స్వీట్స్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై పూర్తి విశ్వాసంతో ఉన్నారన్నారు.