వైభవంగా కోదండ రామాలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవం

వైభవంగా కోదండ రామాలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవం

E.G: కోరుకొండ మండలం రాఘవపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ కోదండ రామాలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవం శనివారం వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ శ్రీరాముల వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నారు.