'ప్రభుత్వ కళాశాల విద్యార్థులను ప్రోత్సహించాలి'

తూ.గో: ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులందరినీ ప్రోత్సహించాలని రాజోలు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సాయిబాబా అన్నారు. రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తృతీయ సంవత్సరం బీఏ, బీకాం, బీఎస్సీలో టాపర్లుగా నిలిచిన 8 మంది విద్యార్థులకు ముమ్మిడివరంకు చెందిన శ్రీకాంత్ కన్సల్టెన్సీ వారు రూ. 32,000 బహుమతిగా అందజేశారు.