అంగన్‌వాడీలో కుళ్లిన కోడిగుడ్లు

MHBD: కురవి మండలం గాజతండాలోని ఓ అంగన్‌వాడీ కేంద్రంలో కుళ్లిన కోడిగుడ్లు కలకలం రేపుతున్నాయి. ఇటీవల తండాకు చెందిన పలువురు అంగన్వాడి కేంద్రం నుంచి ఇంటికి తెచ్చిన కోడిగుడ్లు పగలగొట్టి చూడగా పూర్తిగా కుళ్ళిపోయి ఉన్నాయి. దీంతో గ్రామస్తులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. అంగన్‌వాడీ నిర్వాహకులు పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని వాపోయారు.