VIDEO: ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని రైల్వే ట్రాక్ దాటుతూ..
KNR: జమ్మికుంట రైల్వే స్టేషన్ వద్ద కొత్తపల్లి నివాసులు ప్రతిరోజూ రైల్వే ట్రాక్ దాటుతూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుంటున్నారు. 2 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని ప్రమాదకర మార్గాన్ని ఎంచుకుంటున్నారు. రైలు నిలిచినప్పుడు కింద నుంచి దాటే ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రమాదాలు సంభవించక ముందే అధికారులు చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.