గ్యాస్ మాస్కులతో పార్లమెంట్‌కు ఎంపీలు

గ్యాస్ మాస్కులతో పార్లమెంట్‌కు ఎంపీలు

ఢిల్లీ కాలుష్యంపై నిరసనగా విపక్ష ఎంపీలు అందరినీ ఆశ్చర్యపరిచే పని చేశారు. గ్యాస్ మాస్కులు ధరించి పార్లమెంట్‌కు వచ్చారు. కాలుష్యంతో జనం ఊపిరి ఆడక ఇబ్బంది పడుతుంటే.. ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు. మాస్కులు పెట్టుకుని ఎంపీలు పార్లమెంట్‌లోకి ఎంట్రీ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కాలుష్యంపై తక్షణం చర్చ జరగాలని వారు డిమాండ్ చేశారు.