'ప్రతి విద్యార్థికి సురక్షితమైన త్రాగునీరే తాగాలి'
CTR: సమగ్ర శిక్షా చిత్తూరు ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలలో RO వాటర్ ప్లాంట్ల వినియోగంపై మంగళవారం ఒకరోజు శిక్షణా కార్యక్రమం కన్నన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని 450 ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు హాజరయ్యారు. పాఠశాలల్లోని ఆర్వో వాటర్ ప్లాంట్లను ఎలా ఉపయోగించాలో కంపెనీ ప్రతినిధులు అవగాహన కల్పించారు.