VIDEO: ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

TPT: గూడూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో శనివారం గూడూరు రూరల్ మండలం పరిధిలో నూతన గృహాలకు మంజూరైన 197 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే డా. పాశం సునీల్ కుమార్ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం ఇచ్చిన వాగ్దానాలన్నింటిని నెరవేరుస్తుందని పేర్కొన్నారు.