నీటి భద్రత కార్యక్రమానికి ఎమ్మెల్యే మురళీమోహన్ శ్రీకారం
CTR: బంగారుపాళ్యం మండలం జంబువారిపల్లి గ్రామంలో వెంకటప్ప నాయుడు చెరువు వద్ద కార్యక్రమం జరిగింది. చెరువుల పునరుద్ధరణ, నీటి సంరక్షణ లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని పూతలపట్టు ఎమ్మెల్యే డా. కలికిరి మురళీమోహన్ ప్రారంభించారు. భూగర్భ జలాల పెంపు, సాగునీటి సంఘాల బాధ్యతపై అవగాహన కల్పించారు. స్థానిక నాయకులు, రైతులు కార్యక్రమంలో పాల్గొన్నారు.