'నేరాల నియంత్రణకు డ్రోన్ కెమెరాలు ఉపయోగపడతాయి'

'నేరాల నియంత్రణకు డ్రోన్ కెమెరాలు ఉపయోగపడతాయి'

BPT: నేరాల నియంత్రణకు డ్రోన్ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని చెరుకుపల్లి ఎస్సై అనిల్ కుమార్ తెలిపారు. చెరుకుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా గురువారం డ్రోన్ కెమెరాలు ఉపయోగించి నిఘా ఏర్పాటు చేశామన్నారు. ప్రజారక్షణలో భాగంగా సెక్యూరిటీ, రెస్క్యూ ఆపరేషన్, ట్రాఫిక్ మేనేజ్మెంట్‌కు డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నామన్నారు.