నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
NZB:చందూర్ మండల కేంద్రంలో నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని గ్రామ పంచాయతీ ఎలక్ట్రిషియన్ సయ్యద్ ఖలీం తెలిపారు. ఉదయం 10 నుంచి 11:45 గంటల వరకు కొత్త వీధి దీపాలు అమర్చడం, పాడైన వాటికి మరమ్మతులు చేసే పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నందున ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.