రోడ్లకు మరమ్మత్తులు చేయించాలని వినతి
SRD: కంది మండలంలో పాడైన రోడ్లకు మరమ్మత్తులు చేయించండి కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో R&B ఈఈ శ్రీనివాస్‌కు గురువారం సమర్పించారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నరసింహులు మాట్లాడుతూ.. రోడ్లు అద్వానంగా ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. గుంతలు పడిన రోడ్లకు మరమ్మత్తులు చేయించాలని కోరారు.