చేపల వేటకు వెళ్లి యువకుడు మృతి

చేపల వేటకు వెళ్లి యువకుడు మృతి

NZB: నవీపేట్ మండలం నాలేశ్వర్ గ్రామానికి చెందిన అక్షయ్ (18) చేపల వేటకు వెళ్లి మృతి చెందాడు. నవీపేట్ ఎస్సై తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. నాలేశ్వర్‌లోని గోదావరిలో రోజు మాదిరిగా ఇవాళ చేపల వేటకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాళ్లకు వల చుట్టుకొని గోదావరిలో మునిగి చనిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రి తరలించారు.