రాష్ట్రంలో ఇదే మొదటిసారి
చిత్తూరులో సంచలనం సృష్టించిన కఠారి దంపతుల హత్యకేసులో కోర్టు అంతిమ తీర్పునిచ్చింది. సుదీర్ఘ విచారణ తర్వాత న్యాయస్థానం ఐదుగురు నిందితులకు మరణ దండన విధించిన విషయం తెలిసిందే. అయితే, రాష్ట్రంలో ఒకేసారి ఐదుగురికి ఉరిశిక్ష విధించడం ఇదే మొదటిసారి. ఈ కేసులో ప్రధాన నిందితుడు చంద్రశేఖర్ (చింటూ) అని న్యాయస్థానం నిర్దారించిన సంగతి విధితమే.