కొడంగల్ డిగ్రీ కళాశాలకు ఉచిత పుస్తకాలు అందజేత

కొడంగల్ డిగ్రీ కళాశాలకు ఉచిత పుస్తకాలు అందజేత

VKB: కొడంగల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు న్యూఢిల్లీకి చెందిన సుల్తాన్ చాంద్ ట్రస్ట్ రూ. 5,72,290 విలువైన 1287 పాఠ్య పుస్తకాలను శనివారం ఉచితంగా అందజేసింది. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపల్ డా. బి. శ్రీనివాస్ రెడ్డి శనివారం వివరాలు వెల్లడించారు. కొత్త పుస్తకాల రాకతో కళాశాల లైబ్రరీ మరింత బలోపేతమైందని, ఇది విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరమని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.