ఉరేసుకొని మహిళ ఆత్మహత్య
WNP: భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పెబ్బేరులో జరిగింది. 'మహేందర్, సువర్ణ చెలిమిళ్లలో నివాసముంటున్నారు. భర్త వేరే మహిళతో సంబంధం పెట్టుకొని సువర్ణను నిత్యం మానసికంగా, శారీరకంగా హింసించేవాడు. శుక్రవారం కూడా అతడు భార్యతో గొడవపడ్డాడు. మనస్థాపానికి గురైన సువర్ణ శనివారం ఇంట్లో దూలానికి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.