కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పణ

కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పణ

MNCL: జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో కుక్కలు, కోతుల బెడదను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని బీజేపీ జన్నారం నాయకులు కోరారు. ఈ మేరకు వారు సోమవారం మంచిర్యాల కలెక్టరేట్లో కలెక్టర్ కుమార్ దీపక్‌కు వినతిపత్రం సమర్పించారు. కుక్కలు, కోతుల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బద్రీ నాయక్, బెడద గోపాల్ ఉన్నారు.