'ధాన్యం కొనుగోలుకు పక్కా ప్రణాళిక సిద్ధం'
PDPL: జిల్లాలో రబీ ధాన్యం కొనుగోలుకు ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. కొనుగోలుకు సంబంధించి ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 4.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా నిర్దేశించామని తెలిపారు. ఏప్రిల్‌లో కొనుగోలు ప్రారంభించి మే నెలాఖరు నాటికి పూర్తి చేయాలని సూచించారు. అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని తెలిపారు.