పుత్తూరులో ట్రాక్టర్ ఢీకొని యువకుడి మృతి

పుత్తూరులో ట్రాక్టర్ ఢీకొని యువకుడి మృతి

TPT: పుత్తూరు మండలం తడుకు పంచాయతీకి చెందిన నిఖిల్ (18) రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. గురువారం రాత్రి తండ్రి విజయ్, కొడుకు నిఖిల్ నిత్యవసర సరుకుల కోసం పుత్తూరుకు రావడానికి టి.ఆర్ కండ్రిగ బస్టాప్ వద్ద వేచి ఉన్నారు. అదే సమయంలో అటుగా వెళుతున్న ఓ ట్రాక్టర్ నిఖిల్ ను ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడిన నిఖిల్ చికిత్స పొందుతూ మృతి చెందాడు.