వ్యాన్ బోల్తా.. వ్యక్తికి గాయాలు

కృష్ణా: నందివాడలో గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. పుట్టగుంట సమీపంలోని బుడమేరులో వ్యాన్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ వ్యక్తికి స్వల్ప గాయాలు కాగా స్థానికులు అతడిని బయటికి తీశారు. వ్యాన్ అతివేగంతో వచ్చి బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా చేశారు.