మహిళల్లో పెరుగుతున్న గంజాయి వ్యసనం

మహిళల్లో పెరుగుతున్న గంజాయి వ్యసనం

గంజాయి యువత భవిష్యత్తును నాశనం చేస్తోంది. మగవారు మాత్రమే గంజాయి సేవిస్తారనే అపోహ ఉన్నప్పటికీ.. తాజాగా మహిళల్లోనూ ఈ వ్యసనం పెరుగుతున్నట్లు వెల్లడైంది. పార్టీలు, తోటి యువతుల ప్రోద్బలంతో, అందం పెరుగుతుందనే అపోహలతో యువతులు గంజాయి ఊబిలోకి దిగుతున్నారు. అయితే, గంజాయి వల్ల కలిగే అనారోగ్య సమస్యలు మగవారి కంటే ఆడవారిలోనే ఎక్కువ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.