మోదీ పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపులు

GNTR: మే 2న ప్రధాని మోదీ అమరావతి పర్యటన నేపథ్యంలో ఉదయం 5గంటల నుంచి రాత్రి 10వరకు ట్రాఫిక్ మళ్లింపులు అమలులోకి రానున్నాయి. చిలకలూరిపేట, చెన్నై, గుంటూరు వైపుల నుంచి విశాఖపట్నం వెళ్లే వాహనాలను పొన్నూరు, చందోలు, చెరుకుపల్లి, పెనుముడి బ్రిడ్జ్, పామర్రు, గుడివాడ మార్గంలో మళ్లించనున్నారు. మల్టీ యాక్సిల్ వాహనాలకు రాత్రి 9తర్వాత మాత్రమే ప్రయాణానికి అనుమతి.