VIDEO: ఆపరేషన్ ముస్కాన్ తర్వాత మళ్లీ పిల్లలతో భిక్షాటన
NLG: జిల్లాలో మళ్లీ బెగ్గింగ్ మాఫియా కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. చిన్నపిల్లలు, మైనర్ బాలికలను ఉపయోగించి భిక్షాటన చేస్తున్న మహిళలు రద్దీ ప్రాంతాల్లో ప్రజలను సెంటిమెంటల్ చేసి డబ్బు వసూలు చేస్తున్నారు. ఆపరేషన్ ముస్కాన్ ద్వారా గతంలో ఎన్ని మంది చిన్నారులను విముక్తి చేసినా, ఈ చర్యలు మళ్లీ కొనసాగుతున్నాయి. స్థానికులు చైల్డ్ వెల్ఫేర్ అధికారుల దృష్టి సారించి పిల్లలను రక్షించాలంటున్నారు.