'సమస్యల పరిష్కారంలో మొదటి స్థానం'
PPM: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన వినతులను పరిష్కారం చేయడంలో రాష్ట్రస్థాయిలో జిల్లా ప్రథమ స్థానంలో ఉందని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్ది పేర్కొన్నారు. ఇందుకు కృషి చేసిన జిల్లా అధికారులను ఆయన అభినందించారు. గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ వినతులపై కలెక్టర్ జిల్లా అధికారులతో సమీక్షించారు.