VIDEO: రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు

VIDEO: రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు

KDP: కమలాపురం-కాజీపేట రహదారిలోని బ్రిడ్జి వద్ద ఆదివారం ద్విచక్ర వాహన ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో వేగంగా వస్తున్న ఓ వ్యక్తి అదుపుతప్పి వాహనం నుంచి కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. గాయపడిన వ్యక్తి మైదుకూరు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తింపు.